బైడెన్-కమలాహారీస్ కు నాట్స్ శుభాకాంక్షలు

NATS Wishes to Joe Biden and Kamala Harries

అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్‍, కమలా హ్యారిస్‍కు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) శుభాకాంక్షలు తెలిపింది. అమెరికాను ప్రగతి పథంలో నడిపేందుకు జో బైడెన్‍ అకుంఠిత భావంతో పనిచేస్తారని నాట్స్ ఆశాభావం వ్యక్తం చేసింది. భారతీయ మూలలున్న కమల ఉపాధ్యక్షురాలు కావడం యావత్‍ భారతీయులందరూ గర్వించదగ్గ విషయమని నాట్స్ కొనియాడింది. కమల అమెరికా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణం చేస్తున్న సమయంలో అమెరికాలో నివసించే ప్రతి ప్రవాస భారతీయుడి గుండె ఉప్పొంగి పోయిందని నాట్స్ పేర్కొంది. ప్రవాస భారతీయులకే కాకుండా ప్రపంచ మహిళలకు కూడా కమల ఆదర్శంగా నిలిచారని నాట్స్ ప్రశంసించింది. నాట్స్ తరపున కమలా హ్యారిస్‍కు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్టు నాట్స్ ఛైర్మన్‍ శ్రీధర్‍ అప్పసాని, నాట్స్ అధ్యక్షుడు విజయ్‍ శేఖర్‍ అన్నే ఒక ప్రకటనలో తెలిపారు.

 


                    Advertise with us !!!