
గడిచిన 24 గంటల్లో దేశంలో 14,545 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా 18,002 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. మరో 163 మంది మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారని చెప్పింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,06,25,428కు పెరిగింది. ఇప్పటి వరకు 1,02,708 మంది కోలుకోగా..మృతుల సంఖ్య 1,53,032కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,88,688 యాక్టివ్ కేసులున్నాయని చెప్పింది. కాగా, వ్యాక్సిన్ డ్రైవ్లో ఇప్పటి వరకు 10,43,534 మందికి వ్యాక్సిన్ వేసినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.