
అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ నెలసరి వేతనం భారత కరెన్సీలో దాదాపు రూ.5 లక్షలు(7,114 డాలర్లు) తీసుకోనున్నారు. అంతేకాకుండా ఇతరత్రా ఖర్చులకు 50 వేల డాలర్లు, విందు, వినోదాలకు ఏడాదికి 19 వేల డాలర్లు లభించనున్నాయి. రిటైరయ్యాక ఏడాదికి 2 లక్షల డాలర్లు ఫించను పొందనున్నారు. ఇవి కాకుండా లభించే అదనపు వసతులు చూస్తే మాత్రం కళ్లు బైర్లు కమ్ముతాయి. వీటిలో మొదటిది ఎయిర్ ఫోర్స్ వన్ విమానం. దీన్ని అధ్యక్షుడి అధికారిక పర్యటనల కోసం వినియోగిస్తారు. ఇలాంటివి 2 విమానాలు అందుబాటులో ఉంటాయి. ఇందులో 3 అంతస్తులతో 100 మంది కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విమానం గంటసేపు ప్రయాణిస్తే 2 లక్షల డాలర్లు ఖర్చవుతుంది. ఈ విమానం గాల్లోనే ఇంధనాన్ని నింపుకోగలదు. ఇది కాకుండా మెరీన్ వన్ అనే హెలికాప్టర్, అత్యాధునిక బీస్ట్ అనే కారు కూడా అందుబాటులో ఉంటుంది.