
తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ (టిటిఎ) ఆధ్వర్యంలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నా పదిహేను పేద కుటుంబాలకు కుట్టు మిషన్లు మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నటి అర్చన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పేదలను ఆదుకోవడానికి అందరూ ముందుకు రావాలని కోరారు. పలువురికి ఆమె కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి టిటిఎ ఫౌండర్ డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డి, ప్రెసిడెంట్ మోహన్ పాటలోళ్ల ఎలక్ట్ ప్రెసిడెంట్ వంశీ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సురేష్ రెడ్డి, మాజీ ప్రెసిడెంట్ భరత్ మాదాడి మిగతా సభ్యులు సహకరించారు.