
వలస విధానానికి సంబంధించిన సమగ్ర బిల్లును కాంగ్రెస్ అమోదానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పంపించారు. యూఎస్ సిటిజన్‌షిప్ యాక్ట్-2021 పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లు ద్వారా దేశంలో అనుమతి లేకుండా నివసిస్తున్న వలస ప్రజలకు పౌరసత్వం కల్పించనున్నారు. ఈ పౌరసత్వం పొందాలంటే వలస ప్రజలు జనవరి 1, 2021 నాటికి కనీసం ఐదేండ్ల పాటు దేశంలో నివసిస్తున్నట్టు చూపాల్సి ఉంటుంది. మరోవైపు, ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డులపై ప్రస్తుతమున్న దేశాలవారీ కోటాను కూడా బైడెన్ ఎత్తివేశారు. దీంతో వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు ప్రయోజనం చేకూరనున్నది. దీంతో పాటు డ్రీమర్స్ ను (చిన్నతనంలోనే తల్లిండ్రులతోపాటు అనుమతి లేకుండా అమెరికాలోకి ప్రవేశించినవారు) దేశం నుంచి వెళ్లగొట్టకుండా తాత్కాలిక ఉపశమనం కలిగించే బిల్లుకు కూడా బైడెన్ ఆమోదం తెలిపారు.