భారతీయ అమెరికన్ ల ఉత్సవాలు...

indian-americans-celebrate-beginning-of-reign-of-biden-and-kamalaharris

అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్‍, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‍ పరిపాలన ప్రారంభం సందర్భంగా భారతీయ అమెరికన్లు ఉత్సవాలు జరుపుకున్నారు. ఇది చారిత్రక సంఘటనగా అభివర్ణిస్తూ అవధుల్లేని అవకాశాలకు అమెరికా ఉత్తమ దేశంగా నిర్ధారించారు. భారతీయ సంతతికి చెందిన తొలిమహిళ, నల్లజాతీయురాలైన 56 ఏళ్ల కమాల హారిస్‍ ఉపాధ్యక్షురాలు కావడం చారిత్రక సంఘటనగా ఇండియానాకు చెందిన కమ్యూనిటీ లీడర్‍, ఎంటర్‍ ప్రెన్యూర్‍ గురిందర్‍ సింగ్‍ ఖల్సా శ్లాఘించారు. బైడెన్‍, హారిస్‍ అధ్యక్ష, ఉపాధ్యక్షులు కావడం తాను ఎంతో ఉద్వేగానికి గురవుతున్నానని, అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తాను ఎక్కువగా పాల్గొనగలిగానని కాలిఫోర్నియాకు చెందిన ఇండియన్‍ అమెరికన్‍ అజయ్‍జైన్‍ భుటోరియా తన స్పందన తెలియచేశారు. మన ప్రజాస్వామ్యంలో సమగ్రత, పోటీ తత్వాన్ని పునరుద్ధరించడానికి మనమంతా సమిష్టిగా కృషి చేశామని అన్నారు. బైడెన్‍, హారిస్‍ అమెరికా జాతిని ఐక్యం చేయగలరన్న నమ్మకాన్ని ఏకో సిక్‍ సంస్థాపకులు రజ్వంత్‍ సింగ్‍ వెలిబుచ్చారు.