ప్రమాణ స్వీకారోత్సవంలో లేడీ గగా శాంతి సందేశం

lady-gaga-sings-us-national-anthem-at-joe-biden-inauguration-ceremony

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‍ ప్రమాణ స్వీకారోత్సవంలో హాలీవుడ్‍ నటి లేడి గగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్పొరేట్లు, సినీ ప్రముఖుల తళుకుబెలుకుల మధ్య ఆడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె జాతీయ గీతాన్ని ఆలాపించారు. అంతేకాదు ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ తన ఎర్రటి స్కర్ట్పై తెల్లని శాంతి కపోతం చిహ్నాన్ని ధరించడం ద్వారా శక్తిమంతమైన భావోద్వేగపూరిత సందేశాన్నిచ్చారు.

అటు పిమ్మట ట్విట్టర్‍ వేదికగా శాంతి కపోతం చిహ్నాన్ని తాను ధరించడానికి కారణాలు వివరించారు. అందరికి శాంతి కలుగాలని కోరుతూ తాను ఆ చిహ్నం ధరించినట్లు చెప్పారు. అమెరికన్ల కోసం జాతీయ గేయాన్ని ఆలాపించడం తనకు గౌరవం అని పేర్కొన్నారు. దేశ ప్రజలంతా ఆప్యాయత, ప్రేమానురాగాలతో జీవనం సాగించాలన్నదే తన ఉద్దేశం అని ట్వీట్‍ చేశారు. లేడీ గాగాతో పాటు సినీ నటి జెన్నీఫర్‍ లోపేజ్‍, గాయకుడు గార్త్ బ్రూక్స్ తదితరులు పాల్గొన్నారు.

 


                    Advertise with us !!!