చైనా సంచలన నిర్ణయం!

China bans several Trump officials from doing business with or entering China

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‍ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నిముషాలకే చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ కేబినెట్‍లో కీలక నేతగా ఉన్న మైక్‍ పాంపియోతో పాటు మరో 27 మంది నేతలను తమ దేశంలో అడుగుపెట్టకుండా చైనా నిషేధం విధించింది. అంతేకాదు వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా చైనా ప్రధాన భూభాగంలో కానీ, హాంకాంగ్‍లో కానీ, మకావూలో కానీ అడుగుపెట్టకూడదంటూ ఆల్టిమేటం జారీ చేసింది. వ్యక్తిగత పనులతో పాటు వ్యాపార కార్యకలాపాల కోసం కూడా వారిని తమ దేశంలో అడుగుపెట్టన్విబోమని ప్రకటించింది.