శశికళకు కరోనా పాజిటివ్

VK Sasikala tests positive for Covid 19 admitted to ICU

అన్నాడీఎంకే మాజీ నాయకురాలు శశికళకు కరోనా వైరస్‍ సోకింది. బెంగళూరులోని సెంట్రల్‍ జైలులో అస్వస్థతకు గురైన శశికళను జైలు అధికారులు స్థానిక లేడీ క్యూర్‍జోన్‍ ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. జ్వరం, వెన్నునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న ఆమెకు కరోనా వైరస్‍ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‍ వచ్చినట్లు తేలింది. తొలుత యాంటిజెన్‍ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‍గానే తేలినిప్పటికీ.. ఆర్టీపీసీఆర్‍ పరీక్షలు చేయడంతో పాజిటివ్‍గా నిర్ధారణ అయ్యింది. అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళ జైలు నుంచి ఈ నెల 27న విడుదల కానున్నట్లు ఆమె తరపు న్యాయవాది రాజా సెంధూరపాండియన్‍ తెలిపారు.

 


                    Advertise with us !!!