శ్రీవారి సేవలో జనసేన అధినేత ..

Jana Sena Chief Pawan Kalyan Visits Tirumala

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని జనసేన అధినేత పవన్‍ కల్యాణ్‍ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‍ నాదెండ్ల మనోహర్‍తో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న జనసేనానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేష వస్త్రంతో సత్కరించారు. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా పవన్‍ మాట్లాడుతూ ఏడాది నుంచి స్వామివారి ఆశీస్సుల కోసం రావాలనుకుంటున్నట్లు చెప్పారు. కరోనా వైరస్‍ ప్రభావంతో రాలేకపోయానని, ఇవాళ స్వామివారి ఆశీస్సులు లభించాయని తెలిపారు. పవన్‍ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు.

 


                    Advertise with us !!!