ఇలాంటి ప్రభుత్వాన్ని నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదు

bjp-leader-kanna-lakshminarayana-fires-on-ap-government

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వ అండదండలతోనే విగ్రహాల ధ్వంసం జరుగుతోందని బీజేపీ సీనియర్‌ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఆలయాలపై దాడుల విషయంలో డీజీపీ వ్యాఖ్యలను నిరసిస్తూ చేపట్టిన ఆందోళనకు వెళ్లకుండా పోలీసులు కన్నాను గృహ నిర్బందం చేశారు. ఇంటి నుంచి బయటకు రావొద్దని నోటీసులు ఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్యం లేదు. ఏడాదిన్నర కాలంగా రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నా.. కారణం చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఇలాంటి ప్రభుత్వాన్ని నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదు. ఎంతో ఆదర్శనీయంగా ఉండే పోలీస్‌ వ్యవస్థ అధికార పార్టీ చెప్పినట్లు నడుచుకోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. సంక్షేమ పథకాలు, డబ్బులు పంచి మళ్లీ ఎన్నికల్లో గెలవొచ్చని భావిస్తున్నారు. ఇవేవీ వారి సొంత డబ్బులు కాదు. విగ్రహాల ధ్వంసానికి కారకులు ఎవరో ప్రభుత్వం వారంలోగా చెప్పాలి అని కన్నా డిమాండ్‌ చేశారు.

 


                    Advertise with us !!!