తెలంగాణకు కేంద్రం అభినందనలు

Goa and Telangana have also joined the league of 100 percentage  FHTC

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అభినందనలు తెలిపింది. వందశాతం ఫంక్షనల్‌ ట్యాంప్‌ కనెక్షన్‌ రాష్ట్రంగా తెలంగాణ నిలవడంపై కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన స్పందిస్తూ.. ఇప్పటివరకు వంద శాతం ఎఫ్‌హెచ్‌టీసీ పూర్తి చేసిన రాష్ట్రాలుగా గోవా, తెలంగాణ నిలిచాయన్నారు. మొత్తం 54,06,070 గృహాలకు ట్యాప్‌ కనెక్షన్‌ ద్వారా నీటి సరఫరా జరుగుతోందన్నారు. భారతదేశ గ్రామీణ గృహాలకు నీటి కనెక్షన్లు ఉండేలా చూడడానికి తాము దగ్గరగా ఉన్నామన్నారు. హర్‌ ఘర్‌ జల్‌ అనే తమ ఆలోచన త్వరలోనే నిజమవుతుందని కేంద్ర మంత్రి అన్నారు.