రైతులకు సేఫ్టికిట్ లు ఇచ్చిన రాజా కసుకుర్తి

Raja Kasukurthi Donates Safety Kits to Farmers

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) న్యూజెర్సీ కో- ఆర్డినేటర్‍ రాజా కసుకుర్తి ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లీ పోలీసు స్టేషన్‍లో పోలిసులకు, గ్రామస్తులకు హెల్మెట్‍లు, రైతులకు పురుగు మందుల స్పేర్‍ యంత్రాలు, సేఫ్టీ కిట్లు  పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సిఐడి ఏఎస్పీ గోపాలకృష్ణ, హనుమాన్‍ జంక్షన్‍ సిఐ డి.వి వెంకటరమణ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. రైతులకు 8 స్పేర్‍ యంత్రాలు 50 సేఫ్టీ కిట్లు,  పొలీసులకు, గ్రామస్తులకు కలిపి 78 హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళా పొలిసు సిబ్బందికి తానా తరపున చీరలు పంపిణీ చేశారు.

వీరవల్లీ గ్రామస్తుడు కసుకుర్తి రాజా విదేశాల్లో స్ధిరపడిన తాను పుట్టిన జన్మభూమిని మరిచిపోకుండా తానా ఆధ్వర్యంలో చుట్టుపక్కల గ్రామాలలో అనేక  సేవాకార్యక్రమాలు నిర్వహించటం ద్వారా అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని పలువురు ప్రశంసించారు. సిఐడి ఏఎస్పీ గోపాలకృష్ణ మాట్లాడుతూ తానా చేస్తున్న వివిధ సెవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్‍ మదీనాబాషా  సొసైటీ బ్యాంకు మాజీ అధ్యక్షుడు లంక సురేంద్ర మోహన బెనర్జీ, గుండపనేని ఉమావరప్రసాద్‍, కలపాల శ్రీధర్‍, మాజీ సర్పంచ్‍ నందమూరి కృష్ణప్రసాద్‍,  కలపాల నాని, అరవపల్లి అచ్యుతరామయ్య, బడగల కృష్ణ, శివ  పలువురు పోలీసు సిబ్బంది, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.

 


                    Advertise with us !!!