
కరోనా వైరస్ దాటికి అమెరికా వణికిపోతోంది. ప్రపంచంలోనే అధిక తీవ్రత ఉన్న అమెరికాలో కరోనా మరణాల సంఖ్య రెండో ప్రపంచ యుద్ధ కాలంలో మరణించిన అమెరికన్ల సంఖ్యను దాటిపోయిది. అయినప్పటికీ కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, రానున్న రోజుల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉండనున్నట్లు అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం, అమెరికాలో 4,05,400 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవి రెండో ప్రపంచ యుద్ధ కాలంలో మరణించిన అమెరికన్ల సంఖ్య (4,05,399) కన్నా ఎక్కువ. ప్రస్తుతం అమెరికాలో కరోనా తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. రానున్న రోజుల్లో మరింత క్లిష్ట, ప్రాణాంతక సమయంలోకి అడుగు పెడుతున్నాం. ఇలాంటి చీకటి సమయాన్ని మనమందరం కలసికట్టుగా ఎదుర్కోవాలి అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.