సోనూసూద్ కు హైకోర్టులో చుక్కెదురు

High Court Rejects Actor Sonu Sood's Plea Against Illegal Construction Notice

జీఎంసీ జారీ చేసిన నోటీస్‌ను సవాల్‌ చేస్తూ బాలీవుడ్‌ నటుడు సోనుసూద్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. గతేడాది అక్టోబర్‌లో ముంబైలోని సబర్బన్‌ జుహులోని ఓ నివాస భవనాన్ని హోటల్‌గా మార్చారంటూ బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీఎంసీ) నోటీసులు జారీ చేసింది. జీఎంసీ జారీ చేసిన నోటీసును కోర్టు రద్దు చేసి, తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌లో సోనూసూద్‌ కోరారు. గతేడాది  జీఎంసీ నోటీసు అందుకున్న బాలీవుడ్‌ నటుడు సివిల్‌ కోర్టును ఆశ్రయించినా.. ఉపశనమం దొరకలేదు. అనంతరం హైకోర్టులో అప్పీల్‌ చేశాడు. అనుమతి లేకుండా నివాస భవనాన్ని హోటల్‌గా మార్చారనే ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోరుతూ జీఎంసీ ఈ నెలలలో జుహు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్టోబర్‌లో జీఎంసీ భవనాన్ని పరిశీలించి, నిబంధనలు పాటించలేదని, అనధికారికంగా నిర్మాణాన్ని కొనసాగిస్తున్నట్లు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది.

 


                    Advertise with us !!!