
తమ ప్రభుత్వం భయపడి స్థానిక ఎన్నికల వాయిదా కోరడంలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్ అన్నారు. పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై మంత్రి స్పందించారు. హైకోర్టు బెంచ్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతామని సృష్టం చేశారు. రాజకీయాలు కాదు ప్రజల ఆరోగ్యం ముఖ్యమన్నారు. ఎన్నికలు ఎప్పుడైనా సిద్ధమే.. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలకు అంత అనుకూలమైన వాతావరణం లేదు. కొవిడ్ కారణంగా ప్రజల ఆరోగ్యం ముఖ్యమనే ఉద్దేశంతో ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతున్నాం. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలంటే భయపడే వ్యక్తి కాదు. అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిచిన వ్యక్తి ఆయన. రాష్ట్రంలో 51 శాతం ఓట్లతో, 85 శాతం సీట్లతో అధికారంలో ఉన్న మాకు ప్రజల ప్రాణాలే ముఖ్యం అని మంత్రి అన్నారు.