
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పదవి నుంచి దిగిపోతున్నపుడు స్వీడిష్ యువ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్ బర్గ్ ఇచ్చిన పంచ్ అందరినీ ఆకట్టుకుంది. ట్రంప్‌కు మింగుడుపడని విషయం ఇది. లాస్ట్ పంచ్ నాదైయితే ఆ కిక్కే వేరప్పా అన్నట్టుగా లాస్ట్ పంచ్‌తో అదరగొట్టేశారు గ్రెటా. ట్రంప్‌పై తన ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు ఆయనపదవీ విరమణ సమయాన్ని కరెక్టుగా వాడుకున్నారు. ట్వీట్లో గ్రెటా ఏమన్నారంటే.. 'ఉజ్వలమైన, భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్న సంతోషవంతమైన వద్దుడిలా ట్రంప్ కనిపిస్తున్నారు. ఇలా చూడటం చాలా బాగుంది.' అంటూ ట్వీట్ చేశారు. దీనికి ట్రంప్ శ్వేతసౌధాన్ని వీడుతున్న ఫోటోను షేర్ చేయడం విశేషం
కాగా గత ఏడాది సెప్టెంబరులో ఐక్యరాజ్య సమితి వేదికపై ప్రసంగించిన గ్రెట్ ప్రపంచ పర్యావరణ అంశాన్ని ప్రపంచాధినేతలు నిర్లక్క్ష్యం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది ఇలాగే కొనసాగితే మీ బిడ్డలకు భవిష్యత్తు ఉండదంటూ అగ్రనేతలకు ఆమె చురకలంటించారు. అయితే దీనిపై స్పందించిన అప్పటి యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ 'ఆమె ఉజ్వలమైన, భవిష్యత్తుకోసం ఎదురు చూస్తున్న చాలా సంతోషవంతమైన యువతిలా ఉంది. చూడటానికి చాలా బాగుంది.' అంటూ ట్వీట్ చేశారు. మరో సందర్భంలో చిల్ గ్రెటాను ఉద్దేశించి చిల్!' అంటూ ట్రంప్ ఎద్దేవా చేశారు. దీనికి కౌంటర్‌గా చిల్ చిల్ డొనాల్డ్ అంటూ గట్టి చురకలే అంటించిన సంగతి తెలిసిందే. కానీ తాజా పరిణామంలో ఆసక్తికర విషయం ఏమిటంటే ట్విటర్ ట్రంప్‌ను శాశ్వతంగా ఇప్పటికే నిషేధించింది.. సో.. లాస్ట్ పంచ్ కిక్ గ్రెటాదే కదా!