
చంద్రగిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సోదరుని మృతితో ఆయన ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు చెవిరెడ్డి హనుమంత రెడ్డి(45) అనారోగ్యంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, గురువారం ఉదయం మరణించారు. రేపు తుమ్మలగుంటలో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు సంతాపం వ్యక్తం చేశారు.