
అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు గాను బైడెన్‌తో కలిసి పనిచేయడానికి కంకణబద్ధుడనై ఉన్నానని పేర్కొన్నారు. ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొనేందుకు, అంతర్జాతీయ శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఐక్యంగా నిలుద్దామని అమెరికా నాయకత్వానికి పిలుపునిచ్చారు.