
కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పీఠం రాహుల్ గాంధీకే అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ బాధ్యతలు తీసుకునేందుకు ఆయన వెనుకంజ వేస్తే పార్టీలోని సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు అప్పగించనున్నట్లు సమాచారం. సారథ్య బాధ్యతలను తీసుకునేందుకు ఇప్పటి వరకు రాహుల్ అంగీకరించలేదు. గాంధీ కుటుంబానికి నమ్మకమైన వ్యక్తిగా ఉన్న అశోక్ గెహ్లాట్ పేరును ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తోంది. మరోవైపు ఆయన తన మంత్రి వర్గాన్ని విస్తరించే యోచనలో ఉన్నారు. పార్టీ సమావేశం అధినేత్రి సోనియా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం వర్చువల్ విధానంలో జరుగనుంది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడి ఎంపికతో పాటు, సంస్థాగత ఎన్నికలపై సృష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.