
మైక్రోసాఫ్ట్‌తో తాన్లా ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ జట్టు కట్టింది. బ్లాక్‌చైన్ ఆధారిత కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫామ్ వైజ్లీ ఆవిష్కరణకు మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నట్లు తాన్లా ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ చైర్మన్, సీఈవో ఉదయ్ రెడ్డి వెల్లడించారు. తాన్లా కోసం వైజ్లీ నిర్మాణం, అభివృద్ధి బాధ్యతలను మైక్రోసాఫ్ట్ తీసుకుందని చెప్పారు. సైబర్ దాడులతో విలువైన సమాచారం చౌర్యానికి గురవుతున్నది. అందుకే ఓ కొత్త వేదికను తీసుకొస్తున్నాం. ముఖ్యంగా సంస్థలు, మొబైల్ కంపెనీలు, ఓటీటీ ప్లేయర్లు, మార్కెటీర్లు, ఇండస్ట్రీ రెగ్యులేటర్లకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అని ఉదయ్ రెడ్డి అన్నారు.