అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌‌ ప్రమాణం

joe biden sworn in as president of USA

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. భార్య సమక్షంలో కుటుంబానికి చెందిన పురాతన బైబిల్‌ సాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. వాషింగ్టన్‌ డీసీలోని క్యాపిటల్‌లో భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10.20 గంటలకు ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన చేత  ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనకు ముందు ఉపాధ్యాక్షురాలు కమలా హ్యారిస్‌ ప్రమాణం చేశారు. ఆ దేశ మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ తమ భార్యలతో కలిసి హాజరయ్యారు. అయితే తాజా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు.

అమెరికా నూతనాధ్యక్షుడిగా ప్రమాణం చేసిన బైడెన్‌ అత్యంత వయోధికుడైన అధ్యక్షుడిగా రికార్డు సృష్టించారు. 

మరోవైపు ట్రంప్‌ వైఖరి, క్యాపిటల్‌పై ఆయన మద్దతుదారుల దాడి నేపథ్యంలో బైడెన్‌, కమలా ప్రమాణ స్వీకారానికి అమెరికా చరిత్రలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. లేడీ గగా జాతీయ గీతం ఆలపించగా , జెన్నిఫర్‌ లోపెజ్‌ తన పాటలతో అలరించారు. 

ప్రమాణ స్వీకారం అనంతరం జో బైడెన్ మాట్లాడుతూ.. అమెరికాలో కొత్త చరిత్ర ప్రారంభమైందని అన్నారు. ఇది అమెరికా ప్రజలందరి విజయమని చెప్పారు. ముందు ముందు సాధించాల్సింది చాలా ఉందని అన్నారు.

 


                    Advertise with us !!!