టాలీవుడ్ కి మరో హీరో యశ్ ని పరిచయం చేస్తున్న దిల్ రాజు

Dil Raju Planning Movie With Dance Master Yash

కొత్త వాళ్ళని ప్రోత్సహించడంలో దిల్ రాజు ఎప్పుడు కూడా ఒక అడుగు ముందే ఉంటారు. ఇప్పటికే చాలా మంది కొత్త కొత్త నటీనటులను, దర్శకులను, టెక్నిషియన్స్ ని సినీ  ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత ఆయనకి దక్కుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే  మరో కొత్త డాన్స్ మాస్టర్ కి సినిమాల్లో నటించే అవకాశం ఇవ్వబోతున్నట్లు వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. అతను మరెవరో కాదు.. ఇటీవల డ్యాన్స్ మాస్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యశ్ మాస్టర్ ను  దిల్ రాజు తన ప్రొడక్షన్ లో హీరోగా పరిచయం చేయాలనీ భావిస్తున్నట్లు అనుకుంటున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందట. ప్రస్తుతం దిల్ రాజు ప్రొడక్షన్ లో చాలా సినిమాలు  నిర్మాణం జరుపుకుంటున్నాయి. అయితే ఇవన్నీ కూడా పెద్ద సినిమాలు అవ్వడం విశేషం. అయితే ఇక మీదట  చిన్న సినిమాల మీదనే దిల్ రాజు దృష్టి పెట్టబోతున్నట్లు సమాచారం. 

ఈ నేపథ్యంలోనే డ్యాన్స్ మాస్టర్ యష్ తో సినిమా చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. యష్ విషయానికి వస్తే ఈటీవీ లో ప్రసారమయ్యే  ఢీ ప్రోగ్రామ్‌ నుంచి వచ్చిన మరో ఆణిముత్యం ఈయన అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మూడు సీజన్స్ కి కొరియోగ్రాఫర్ గా చేసాడు. రెండు సార్లు ఢీ టైటిల్ గెలుచుకుని, ఒకసారి రన్నర్ గా నిలిచాడు. ఇప్పుడు సినిమాలకు కూడా కొరియోగ్రఫీ చేస్తూ తనదైన మార్క్ వేసుకుంటున్నాడు ఈయన. ఈ మధ్యే విడుదలైన చిత్రలహరిలో గ్లాస్ మేట్ సాంగ్‌తో పాటు దానికి ముందు సమంత యు టర్న్ సాంగ్ కూడా యశ్ కొరియోగ్రఫీ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు.. మరి ఇప్పుడు నిజంగానే దిల్ రాజు ప్రొడక్షన్ లో  హీరోగా యష్ ఎంట్రీ ఇస్తే తన కెరీర్ పరంగా స్టార్ గా నిలపడోచ్చు.

 

 


                    Advertise with us !!!