
అమెరికా ఉపాధ్యక్షురాలుగా కమలా హ్యారిస్ ప్రమాణం చేస్తున్న తరుణంలో తమిళనాడులోని కమలా తల్లి సొంతూరైన తులసేంతిరాపురం వేడుకలకు ముస్తాబైంది. ప్రమాణ కార్యక్రమాన్ని వేడుకగా జరుపుకునేందుకు గ్రామ ప్రజలు సాంప్రదాయక రెసిపీ మురుక్కు తయారు చేయడంలో నిమగ్నమయ్యారు. కమలా హారిస్ విజయానికి గుర్తుగా ఊర్లోని రహదారులను శుభ్రపరిచి.. చౌరస్తాల్లో పుష్పాలతో అలంకరణ చేశారు. ఉదయం నుంచి ప్రజలు రోడ్లపైకి చేరుకుని బాణాసంచా కాల్చారు. కమలా హ్యారిస్ ఆరోగ్యం కోసం ప్రజలు గ్రామంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు.
అమెరికా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన కమలా హ్యారిస్ తల్లి పూర్వీకులు తమిళనాడులోని నాగపట్నం జిల్లాలోని తులసేంతిరాపురం గ్రామంలో నివసించేవారు. ఇప్పటికీ వీరి కుటుంబీకులు కొందరు ఆ గ్రామంలో నివసిస్తున్నారు. మురుక్కు తయారుచేస్తున్న మహిళ శివరంజనిని కదపగా.. ఈ రోజు గ్రామంలోని ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మా కమలా అమెరికా వైస్ ప్రెసిడెంట్ కావడానికి సిద్ధం ఉంది. మేమంతా ఈ రోజును వేడుకగా జరుపుకుంటున్నాం. మా గ్రామంలోని చాలా మంది మహిళలకు ఆమె స్ఫూర్తినిచ్చింది అని చెప్పారు.
ఇంత చిన్న గ్రామానికి చెందిన మా కమలా అమెరికాకు ఉపాధ్యక్షురాలు రేసులో గెలువడం చాలా సంతోషకరం. మేమే ఆ పదవిని గెలుచుకున్నట్లుగా సంబరపడుతున్నాం. కమలా గెలిచిన రోజున ఎంతో గర్వించాం. ఇప్పుడు ప్రమాణస్వీకారాన్ని పండుగలా జరుపుకుంటున్నాం. ఆమె కోసం నేను కూడా గ్రామ ఆలయంలో ప్రార్థనలు చేశాను అని గ్రామానికి చెందిన వృద్ధుడు రాధాకృష్ణన్ చెప్పారు.