కేజీఎఫ్ 2 క్లైమాక్స్ కే 12 కోట్లు ఖర్చు పెట్టారట !!

KGF Chapter 2 Climax Shoot Budget

సౌత్ సినీ ప‌రిశ్ర‌మ స్థాయి రోజు రోజుకి ఎదుగుతోంది పాన్ ఇండియా మూవీస్ అంటూ  బాలీవుడ్ రేంజ్‌లో మ‌నోళ్ళు సినిమాలు తీస్తుండే స‌రికి హిందీ నిర్మాత‌లు కూడా మ‌న సినిమాపై ఓ క‌న్నేస్తున్నారు. అంతేకాదు మ‌న సౌత్‌లో హిట్టైన చాలా చిత్రాల‌ని రీమేక్ చేస్తూ విజ‌యాలు సాధిస్తున్నారు. ఇప్పుడు ప‌లు చిత్రాలు హిందీలో రీమేక్ కాగా, అవి విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. అయితే క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ స్థాయినే కాక సౌత్ ప‌రిశ్ర‌మ స‌త్తా ఏంటో నిరూపించిన యాక్ష‌న్ మూవీ కేజీఎఫ్ చాప్టర్ 1  ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో య‌ష్ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రం ఇండియన్  బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ళ వర్షం కురిపించింది. కేజీఎఫ్ చిత్రం బంగారు గ‌నుల నేప‌థ్యంలో తెర‌కెక్కగా, ఈ సినిమాపై విమ‌ర్శ‌కులు కూడా ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ సినిమా విజ‌యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సీక్వెల్ కూడా తెర‌కెక్కిస్తున్నారు. 

కేజీఎఫ్ 2 చిత్రంలో బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్, ర‌వీనా టాండ‌న్ వంటి ప్ర‌ముఖులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. రీసెంట్‌‌గా చిత్ర షూటింగ్ పూర్తి కాగా, ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. మ‌రి కొద్ది రోజుల‌లో మూవీని థియేట‌ర్స్ లో తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. చాప్టర్ 1 ఊహలకు అందని హిట్ కావడంతో చాప్టర్ 2 పై ఈ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. దానికి తగినట్టుగానే ఇటీవల విడుదలైన టీజర్ రికార్డు స్థాయి లో వ్యూయర్ షిప్ నమోదు చేసింది.   మరి భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రంలోని క్లైమాక్స్ చాలా కీల‌కం కాగా, ఇందులో అధీరా పాత్ర పోషిస్తున్న సంజ‌య్ ద‌త్.. రాఖీ భాయ్ పాత్ర పోషిస్తున్న య‌ష్ ఇద్ద‌రు భీక‌ర పోరాటం చేయ‌నున్నారు. ఈ క్లైమాక్స్ కోసం నిర్మాణ సంస్థ హోంబ‌లే వారు ఏకంగా 12 కోట్లు ఖ‌ర్చు పెట్టిన‌ట్టు స‌మాచారం. చిత్రాన్ని 100 కోట్ల బడ్జెట్‌తో తెర‌కెక్కించ‌గా, ఇందులో 12 కోట్లు క్లైమాక్స్‌కే ఖ‌ర్చు చేశారంటే సినిమా క్లైమాక్స్ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్దం చేసుకోవ‌చ్చు.

 


                    Advertise with us !!!