తనపై ఒకలా...నల్లపురెడ్డిపై మరొకలా : జేసీ

jc prabhakar reddy press meet

నెల్లూరు జిల్లా ఎస్పీని వైకాపాకు చెందిన కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తిడితే పోలీసు సంక్షేమ సంఘం ఏం చేస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. పోలీసు సంక్షేమ సంఘానికి పక్షపాతం ఎందుకని నిలదీశారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభాకర్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లు నడుచుకుంటూ పోలీసుల పరువు తీయొద్దని సంఘాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తనపై అకారణంగా ఫిర్యాదు చేసిన సంఘానికి నల్లపురెడ్డి మాటలు వినిపించలేదా? అని ప్రశ్నించారు. తనపై ఒకలా.. నల్లపురెడ్డిపై మరొకలా ఎందుకని ప్రశ్నించారు. ఎందుకంత వ్యత్యాసం చూపిస్తున్నారని నిలదీశారు.

 


                    Advertise with us !!!