
అమెరికా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న కమలాహారిస్‌కు తానిచ్చే సందేశం ఏమీ లేదని ఆమె మేనమామ జీ బాలచంద్రన్ చెప్పారు. కమలాహారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలు కావడానికి తాను చేసిన సాయం ఏమీ లేదని ఆయన తెలిపారు. ఆమె స్వశక్తితో ఆ స్థాయికి ఎదిగిందన్నారు. కమలకు తానెప్పుడూ ఆమె తల్లి శ్యామల చెప్పినట్లుగా నడుచుకోమని మాత్రమే సలహా ఇస్తుండేవాడినని ఆయన చెప్పారు. కమలా సుదీర్ఘకాలంగా నువు ఏపనైనా సరిగానే చేశావు. అదే తీరుగా ఇకపై కూడా కొనసాగు. నేను నీకు చెప్పగలిగింది ఇంతే అని కమలాహారిస్‌ను ఉద్దేశించి బాలచంద్రన్ వ్యాఖ్యానించారు.