తానా మిడ్ అట్లాంటిక్ సంక్రాంతి సంబరాలు

TANA Mid Atlantic Sankranti Celebrations

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్‍ అట్లాంటిక్‍ రీజియన్‍లో జరిగిన సంక్రాంతి సంబరాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన కళా ప్రతిభ అందరినీ ఆకట్టుకుంది.

మిడ్‍ అట్లాంటిక్‍ తానా విభాగం వారు జనవరి 16వ తేదీన వర్చువల్‍గా ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకల్లో ఎంతోమంది పాల్గొన్నారు. తొలుత పూజారి శ్రీ సీతారామస్వామి సంక్రాంతి పండుగ విశేషాలను, విశిష్టతలను తెలియజేశారు. దాదాపు 11 సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ వేడుకల్లో పాఠశాల విద్యార్థులు సంక్రాంతి శుభాకాంక్షలను, సంక్రాంతి పాటలను పాడారు. పద్మశ్రీ శోభారాజు పిల్లలను ఆశీర్వదించారు. తానా సంక్రాంతి వేడుకలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తానా ప్రెసిడెంట్‍, ఇతర నాయకులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. పద్మశ్రీ చిత్ర సంగీత విభావరి అందరినీ ఎంతగానో మైమరపింపజేసింది. తానా అధ్యక్షుడు జయ్‍ తాళ్ళూరి, కార్యదర్శి రవి పొట్లూరి, కల్చరల్‍ కో ఆర్డినేటర్‍ సునీల్‍ పాంత్రా, మిడ్‍ అట్లాంటిక్‍ రీజినల్‍ కో ఆర్డినేటర్‍ సతీష్‍  చుండ్రు తదితరులు ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా కృషి చేశారు. తానా బోర్డ్ చైర్మన్‍ హరీష్‍ కోయ, ఇవిపి అంజయ్య చౌదరి లావు, సెక్రటరీ రవి పొట్లూరి తదితరులు కార్యక్రమంలో మాట్లాడారు.

ఈ కార్యక్రమానికి గ్రాండ్‍ స్పాన్సర్‍గా వ్యవహరించిన ఎన్‍ఎస్‍ఆర్‍ ఎస్టేట్స్కు రవి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన మిడ్‍ అట్లాంటిక్‍ టీమ్‍, హారీస్‍బర్గ్ టీమ్‍కు రంగోళి, కిడ్స్ ఆర్ట్ పోటీల్లో పాల్గొన్నవారందరికీ, జడ్జీలుగా వ్యవహరించిన హిమబిందు కోడూరు, శ్రీలక్ష్మీ ఆలపాటికి సతీష్‍ చుండ్రు ధన్యవాదాలు తెలిపారు. శ్రీలక్ష్మీ కులకర్ణి ఈ కార్యక్రమానికి యాంకర్‍గా వ్యవహరించారు.

Click here for Photogallery


                    Advertise with us !!!