కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం సూట్లోనా? చీరలోనా?

Kamala Harris Swearing in Ceremony

అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్‌ నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే వైఎస్‌ ప్రెసిడెంట్‌ అవుతున్న తొలి మహిళగా కమల ఈ చారిత్రాత్మకమైన కార్యక్రమానికి ఎలాంటి దుస్తులను ధరించి వస్తారు? అమెరికన్‌ పౌరురాలిగా అక్కడి సంస్కృతిని ప్రతిబింబించే ప్యాంట్‌ సూట్‌ను, బౌబ్లవుజును వేసుకుంటారా? లేక భారతీయ సంస్కృతిని ప్రతిఫలించే లా చీరకట్టుతో కనిపించబోతున్నారా? అమెరికాలోని భారతీయ ఫ్యాషన్‌ డిజైనర్‌లు.. ఆమె చీర ధరిస్తే బాగుంటుందనీ, అందులోనూ అందమైన బనారస్‌ చీరను కట్టుకుంటే భారతీయాత్మ ఉట్టిపడటంతో పాటు, నల్లజాతి ప్రజల మనోభావాలను గౌరవించినట్లు కూడా ఉంటుందనీ అంటున్నారు. ఏమైనా ఛాయిస్‌ కమలా హ్యారిస్‌దే.

 


                    Advertise with us !!!