తెలంగాణను అభినందించిన కేంద్రం

Health Ministry appreciates Telangana for efficient vaccine roll out

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని సమర్థవంతంగా, ఎటువంటి పొరపాట్లు లేకుండా నిర్వహిస్తోందంటూ కితాబు ఇచ్చిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్కువ శాతం మంది వైద్య సిబ్బంది ముందుకు వచ్చి టీకా వేయించుకోవడంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ఈ సందర్భంగా ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావుకు, డీఎంఈ డాక్టర్‌ రమేష్‌రెడ్డికి, వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగానికి జిల్లా కలెక్టర్లకు రిజ్వీ అభినందనలు తెలిపారు.

తెలంగాణలో ఈ నెల 16వ తేదీ నుంచి టీకా పంపిణీ మొదలైంది. 16వ తేదీ తొలిరోజు 140 కేంద్రాల్లో, రెండో రోజు 335 కేంద్రాల్లో టీకాలు వేశారు. మూడో రోజు 894 కేంద్రాలకు విస్తరించారు. ఈ మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 69,625 మందికి వ్యాక్సిన్లు వేశారు.

 


                    Advertise with us !!!