‘క్రాక్’ ఎక్కిస్తున్నరికార్డు కలెక్షన్లు బయ్యర్స్ కి ఫుల్ ప్రాఫిట్

KRACK Box office Collection

నవ్విన నాపచేను పండదా అన్నట్లు క్రాక్ విడుదల రోజున నిర్మాత పడ్డ కష్టం అంతా ఇంతా కాదు సెకండ్ షో నుండి ఆటలు పడ్డా సినిమా టాక్ తో  ఆ తరువాత ఇక వసూళ్లే వసూళ్లు  మాస్ మహారాజా  రవితేజ తాజాగా నటించిన  సినిమా  ‘క్రాక్’... పండగ ముగిసినా కలెక్షన్ల జోరుని మాత్రం ఒక రేంజిలో కొనసాగిస్తుంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. 3 ఏళ్ళ నుండీ సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఈ చిత్రం పెద్ద రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ‘డాన్‌శీను’, ‘బ‌లుపు’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్స్ త‌ర్వాత `క్రాక్` చిత్రంతో రవితేజ,  గోపీచంద్ లు కూడా హ్యాట్రిక్ ను కంప్లీట్ చేశారు.‘క్రాక్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 18 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 9 రోజులకు గాను ఈ చిత్రం 27.11 కోట్ల షేర్ ను రాబట్టింది.50 శాతం ఆకుపెన్సీతోనే ఈ రేంజ్ కలెక్షన్లను రాబట్టడం అంటే సాధారణ విషయం కాదు. ఇక ఈ చిత్రం కొన్న బయ్యర్స్ అంతా ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవ్వడం విశేషం!ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లు ఇప్పటివరకూ 9కోట్ల వరకూ లాభాలు పొందాయని సినీ ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి.  

 


                    Advertise with us !!!