
నాంపల్లి కోర్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల హాజరయ్యారు. 2012లో పరకాల ఉప ఎన్నికల సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా రోడ్ షో నిర్వహించారు. ఈ కేసులో విజయమ్మ, షర్మిల కోర్టుకు హాజరయ్యారు. విచారణను ఈ నెల 27వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. గత విచారణలో వైఎస్ విజయమ్మకు, షర్మిలకు కోర్టు సమన్లు జారీ చేసింది. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలంటూ సమన్లలో కోర్టు పేర్కొంది. ఈ కేసులో ఏ1గా విజయమ్మ, ఏ2గా షర్మిల ఉన్నారు.