క్లైమాక్ చిత్రీకరణలో 'ఆర్ ఆర్ ఆర్' ఫుల్ జోష్ తో ఎన్టీర్ రాంచరణ్ ఫాన్స్

RRR s climax shoot begins SS Rajamouli shares a still

దర్శక ధీరుడు రాజమౌళి నేతృత్వం లో  యంగ్ టైగర్ ఎన్టీర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబి లో  ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం "ఆర్ ఆర్  ఆర్"... క్లైమాక్ దశకు చేరుకుందని జక్కన్న పెట్టిన పోస్ట్ తో ఎన్టీర్ రాంచరణ్ ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.   ఇక అసలు విషయానికి వస్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మల్టీస్టారర్ గా చేస్తున్న ఈ ఫెంటాస్టిక్  సినిమా  బాహుబలి సినిమా తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రౌద్రం, రణం, రుధిరం అనే టైటిల్ ని చాలా వినూత్నంగా ఆడియన్స్ కి పరిచయం చేశాడు. అంతేకాదు, భీమ్ వాయిస్ లో అల్లూరిని అలాగే అల్లూరి వాయిస్ లో భీమ్ ని పరిచయం చేశాడు. సరికొత్తగా తెలుగు వీరుల కథని ప్రపంచానికి చాటే విధంగా ఈ సినిమా ఉండబోతోందని ముందుగానే చెప్పాడు డైరెక్టర్.

ఇప్పుడు క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని, మాసివ్ క్లైమాక్స్ సీన్ కి అంతా సిద్ధం అన్నట్లుగా రెండు చేతులు 'టాగ్ అఫ్ వార్ స్టయిల్లో'  ఒక పోస్ట్ పెట్టాడు. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు కలుపుకున్న స్టిల్ ని సైతం ఈ పోస్ట్ లో షేర్ చేసింది చిత్రయూనిట్.మైటీ భీమ్ అండ్ ఫైరీ రామరాజు ఇద్దరూ కలిసి వారు అనుకున్నది సాధించడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది. టైటిల్ పోస్టర్ లో హైలెట్ చేసినట్లుగా ఇది ఎందుకు ఇంతలా షేర్ చేశారు.. ఇక ఈ అద్భుతమైన  సినిమాకి ప్యాకప్ చెప్పేస్తున్నారా.. షూటింగ్ పార్ట్ అయిపోయిందా అని  కామెంట్స్ చేస్తున్నారు. 

 


                    Advertise with us !!!