
పార్లమెంట్లో ఉన్న క్యాంటీన్లో ఇచ్చే ఫుడ్ సబ్సిడీని ఎత్తివేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ఆయన రాబోయే బడ్జెట్ సమావేశాల గురించి మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు పార్లమెంట్లో ఉన్న క్యాంటీన్లో ఎంపీలకు సబ్సిడీ పద్ధతిలో భోజన వసతి ఏర్పాటు చేశారు. అయితే ఆ సబ్సిడీ విధానాన్ని పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు స్పీకర్ బిర్లా తెలిపారు. పార్లమెంట్ సబ్సిడీ ఎత్తివేయడం వల్ల ఏడాదికి 8 కోట్లు ఆదా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలను జనవరి 29వ తేది నుంచి నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.