భారత్ బయోటెక్ కీలక ప్రకటన

Bharat Biotech makes big announcement, reveals who should avoid COVID-19 vaccine

మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే, తాము తయారు చేసిన కరోనా టీకా కొవాగ్జిన్‍ అత్యవసర వినియోగానికి అనుమతులు పొందిన హైదరాబాద్‍ కేంద్రంగా నడుస్తున్న భారత్‍ బయోటెక్‍, టీకా ఎవరు తీసుకోకూడదన్న విషయాన్ని ప్రస్తావిస్తూ కీలక ప్రకటన వెలువరించింది. కరోనా టీకా తీసుకున్న వారిలో దాదాపు 580 మంది తీవ్రమైన దుష్ప్రభావాలకు గురికాగా, ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీకాకు ఎవరూ దూరంగా ఉండాలన్న విషయాన్ని భారత్‍ బయోటెక్‍ ప్రకటించింది.

గతంలో అలర్జీలు ఉన్నవారు, రక్త హీనత, గర్భవతులు, బిడ్డలకు పాలిచ్చే తల్లులు, తీవ్రమైన ఆనారోగ్య సమస్యలు ఉన్నవారు కొవాగ్జిన్‍ను తీసుకోవద్దని సలహా ఇచ్చింది. ఇదే సమయంలో కొవాగ్జిన్‍ కాకుండా మరో వేరియంట్‍ ను తీసుకున్న వారు, శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిపై ప్రభావం చూపించే మందులను వాడుతున్న వారు, జ్వరంతో బాధపడుతున్న వారు కూడా టీకాకు దూరంగా ఉండాలని సూచించింది. ఇక వ్యాక్సిన్‍ తీసుకునే ముందు తమ మెడికల్‍ హిస్టరీని గురించి వైద్యులకు, వ్యాక్సిన్‍ ఆఫీసర్‍ లకు తప్పనిసరిగా తెలియజేయాలని, వారి సలహా, సూచనల మేరకు నడుచుకోవాలని కోరింది.

 


                    Advertise with us !!!