
తెలంగాణ అబ్బాయి, ఐస్లాండ్కు చెందిన అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన జోనకంటి సర్వయ్య-జ్యోతి దంపతుల కుమారుడు భరత్ కొంతకాలంగా ఐస్లాండ్లోని షిప్లో మేల్ బ్యూటీషియన్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమలో అక్కడే డాక్టర్‌గా పనిచేస్తున్న ఐస్లాండ్కు చెందిన క్రిజియాను ప్రేమించి క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు. ఆ విషయాన్ని గొల్లపల్లిలో ఉన్న తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు.