
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పద్మశ్రీ నటరత్న డాక్టర్ నందమూరి తారకరామారావు 25వ వర్ధంతిని జనవరి 18వ తేదీన అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని చెస్టర్స్ప్రింగ్స్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమెరికా పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. తెలుగు చలనచిత్రరంగంలో మకుటంలేని మహారాజుగా వెలుగొంది తెలుగుజాతి ఆత్మగౌరవమే నినాదంగా తెలుగుదేశంపార్టీ స్థాపించి దేశ రాజకీయాలకు ఎన్ఠీఆర్ దశ, దిశ నిర్ధేశం చేశారని బొండా ఉమ తెలిపారు. అభిమానులుగా ఎన్టీఆర్ ఆశయసిద్ధికి నిరంతరం కృషి చెయ్యాల్సిన బాధ్యతని గుర్తు చేసారు.
ఎన్టీఆర్ స్ఫూర్తిగా అమెరికా రాజకీయాల్లో కూడా తెలుగువారు రాణించే రోజులు రానున్నాయని తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన పేర్కొన్నారు.
తానా కార్యదర్శి రవి పొట్లూరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాగరాజు నలజుల, సతీష్ చుండ్రు, సునీల్ కోగంటి, సాయి జరుగుల, ఫణి కంతేటి, సిద్దు, ప్రసాద్ క్రొత్తపల్లి, గోపి వాగ్వాల, కోటి యాగంటి, చలం పావులూరి, కృష్ణ కొనగళ్ల, రంజిత్ మామిడి, బాలాజీ కరి, కిషోర్ కొంక, సాంబ అంచ, సురేష్ యలమంచి తదితరులు పాల్గొన్నారు.