
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టాటా) ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడిగా మోహన్ పాటలోళ్ళ ఎన్నికయ్యారు. ప్రెసిడెంట్ ఎలక్ట్ గా వంశీ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా సురేష్ రెడ్డి వెంకన్నగరి, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ మానాప్రగడ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వెంకట్ గడ్డం, ట్రెజరర్‌గా పవన్ రవ్వ, జాయింట్ సెక్రటరీగా కవితా రెడ్డి కంతల, జాయింట్ ట్రెజరర్‌గా హరీందర్ తాళ్ళపల్లి, నేషనల్ కో ఆర్డినేటర్‌గా వెంకట్ ఎక్క, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్‌గా నవీన్ గోలి, మీడియా, కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా డా. నరసింహారెడ్డి దొంతిరెడ్డి, ఎథిక్స్ కమిటీ కో ఆర్డినేటర్‌గా మాధవి సోలేటి ఎన్నికయ్యారు. బోర్డ్ డైరెక్టర్లుగా వీరితోపాటు శ్రీనివాస్ గనగోని, ప్రసాద్ కూనరపు, శరత్ వేముగంటి, సహోదర్ పెద్దిరెడ్డి, ఉష మన్నెం, దుర్గా ప్రసాద్, నరేందర్ మెతుకు, సతీష్ రెడ్డి మేకల, భాస్కర్ పిన్న, గంగాధర్ ఉప్పల, శివారెడ్డి కొల్ల, నిషాంత్ సిరికొండ, గణేష్ వీరమనేని, కిరణ్, కిరణ్ గూడూరు, మనోహర్‌రావు, నిక్షిప్త రెడ్డి కూర, బిందులత చీదల, గోపి, కార్తిక్ నిమ్మల ఎన్నికయ్యారు.
అడ్వయిజరీ కౌన్సిల్ సభ్యులుగా టాటా వ్యవస్థాపకులు డా. పైళ్ళ మల్లారెడ్డి, డాక్టర్ విజయ్‌పాల్ రెడ్డి (చైర్), డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల (కో చైర్) వ్యవహరిస్తున్నారు.