ఫిబ్రవరి 24 నుంచి మినీ మేడారం జాతర

Mini Medaram jatara from Feb 24 to 27

మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర ఫిబ్రవరి 24 నుంచి నాలుగు రోజులపాటు నిర్వహించేందుకు అమ్మవార్ల పూజారులు తేదీలను ఖరారు చేశారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు జాతర నిర్వహణపై సమావేశమయ్యారు. ఫిబ్రవరి 24న సమ్మక్క-సారలమ్మ దేవతల గుడి శుద్ధీకరణ, 25న అమ్మవార్లకు పసుపుకుంకుమతో అర్చన, 26న భక్తులు అమ్మవార్ల గద్దెలను దర్శించుకోవడం, 27న అమ్మవార్లకు ముగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు జగ్గారావు వెల్లడించారు.