కత్తితో కేక్ కటింగ్ ! : క్షమాపణలు చెప్పిన విజయ్ సేతుపతి

vijay-sethupathi-apologises-for-using-sword-to-cut-his-birthday-cake-issues-statement

ప్ర‌ముఖ త‌మిళ హీరో విజ‌య్ సేతుప‌తి నేడు త‌న పుట్టిన రోజు జ‌రుపుకుంటున్నారు. కేక్‌ను విజ‌య్ చేతుల మీదుగా క‌త్తితో క‌ట్ చేయించారు. ఇలా చేయ‌డం వివాదానికి దారి తీసింది. క‌త్తితో కేక్ చేస్తున్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డం.. హింస‌ను ప్రేరేపించేలా ఉందంటూ నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.

దీంతో విజ‌య్ సేతుప‌తి నెటిజ‌న్లు, అభిమానుల ఆగ్ర‌హాన్ని అర్థం చేసుకుని త‌న‌పై జ‌రుగుతున్న ట్రోల్‌పై  ట్విట‌ర్ వేదిక‌గా స్పందించారు... "నా  పుట్టిన రోజు సందర్భంగా తీసిన ఓ ఫొటో ప్రస్తుతం వివాదాస్పదమ‌వుతుంది.  ఇందులో నేను కత్తితో కేట్‌ కట్‌ చేశాను. నేను దర్శకుడు పొన్రామ్ చిత్రంలో నటించబోతున్నాను. ఇందులో కత్తి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దాంతో కేక్‌ కట్‌ చేయడానికి కత్తిని ఉపయోగించాను. ఈ పనితో నేను సమాజంలోకి తప్పుడు సంకేతాలు పంపానని చాలా మంది అభిప్రాయ పడ్డారు. ఇకపై జాగ్రత్తగా ఉంటాను. నా పనితో ఎవరినైనా బాధపెట్టినట్లయితే, క్షమాపణలు కోరుతున్నాను. నా చర్యకు చింతిస్తున్నాను" అంటూ విజయ్‌ సేతుపతి ట్వీట్‌ చేశారు.