రామ మందిరానికి ఎంపీ రఘురామకృష్ణరాజు విరాళం

MP Raghurama Krishnaraju s donation to Rama Mandir

అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి పలువురు ప్రముఖులు తమ వంతుగా విరాళాలు అందిస్తున్నారు. తాజాగా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు విరాళం అందజేశారు. అయోధ్య రామమందిరం నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా తన మూడు నెలల వేతనాన్ని (రూ.3.9 లక్షలు) విరాళంగా ఇచ్చినట్టు ట్విటర్‌లో వెల్లడించారు. ఈ రోజు భక్తులతో కలిసి రూ.1,11,111లు అందజేసినట్లు తెలిపారు. శతాబ్దాల కాలం నాటి ఈ స్వప్నాన్ని నెరవేర్చేందుకు ప్రతిఒక్కరూ ఎంతోకొంత మొత్తాన్ని ఇచ్చి భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. అది రూ.100లు అయినా రూ.లక్ష అయినా.. ఎవరి శక్తిమేరకు వారు విరాళంగా ఇవ్వాలని కోరారు.

 


                    Advertise with us !!!