జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల గెజిట్‌ విడుదల

Gazette release of winning candidates in GHMC elections

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల పేర్లతో గెజిట్‌ విడుదలైంది. ఎస్‌ఈసీ గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్‌ 4వ తేదీ వెలువడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పాలకవర్గం పదవీకాలం ఫిబ్రవరి 10తో ముగియనుంది. ఈ నెలఖారులో మేయర్‌ ఎన్నిక తేదీ ఖరారు కానుంది. త్వరలోనే కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జీహెచ్‌ఎంసీలో పార్టీల వారీగా బలాబలాలిలా ఉన్నాయి. మొత్తం 150 డివిజన్లకు గాను అధికార టీఆర్‌ఎస్‌-56, బీజేపీ 48, మజ్లిస్‌-44, కాంగ్రెస్‌ -2 స్థానాలు కైవసం చేసుకున్నాయి.


                    Advertise with us !!!