జో బైడెన్‌ ప్రమాణ స్వీకారంలో స్టార్ల ప్రదర్శనలు

Star performances at the swearing in of Joe Biden

అమెరికా 46వ అధ్యక్షుడిగా ఈ నెల 20వ తేదీన జో బైడెన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం అరగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో జెన్నిఫర్‌ లోపేజ్‌, లేడీ గాగా వంటి పలువురు ప్రముఖ పాప్‌ కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అమెరికాలో కోవిడ్‌ 19 మహమ్మారి వ్యాప్తి ఆందోళనకర స్థాయిలో ఉన్న నేపథ్యంలో అధ్యక్షుడిగా జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్‌ వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ భవనం వెస్ట్‌ఫ్రంట్‌లో జరిగే కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చాలా కొద్ది మంది మాత్రమే హాజరుకానున్నారు. పలు కార్యక్రమాలు వర్చువల్‌గానే ఉంటాయి. 


                    Advertise with us !!!