
దేశంలో తొలి వ్యాక్సిన్‌ను మనీష్ కుమార్ అనే ఓ పారిశుధ్య కార్మికుడు తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది అతనికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కూడా పక్కనే ఉన్నారు. ఆ తర్వాత ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గలేరియా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.