తెలంగాణలో కరోనా టీకా తీసుకున్న తొలి వ్యక్తి ఈమెనే..

He was the first person in Telangana to be vaccinated against corona.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. వర్చువల్‌ విధానంలో ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా ప్రక్రియను ప్రారంభించిన అనంతరం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కలిసి ప్రారంభించారు. గాంధీ ఆస్పత్రిలో సఫాయి కర్మచారి ఎస్‌ కృష్ణమ్మ కరోనా టీకా తీసుకున్న తొలి వ్యక్తిగా రికార్డులోకి వెక్కింది. టీకా ఇచ్చిన అనంతరం ఆమెతో మంత్రి ఈటల రాజేందర్‌ సంభాషించారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమెను అబ్జర్వేషన్‌ గదికి తరలించారు.

 


                    Advertise with us !!!