వెనక్కి తగ్గిన వాట్సాప్‌...

WhatsApp reduced back

కొత్త ప్రైవసీ విధానం అప్‌డేట్‌పై అభ్యంతరాలు వ్యక్తమైన వేళ వాట్సాప్‌ కాస్త వెనక్కి తగ్గింది. అప్‌డేట్‌ అమలును కొద్ది రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు బ్లాగ్‌పోస్ట్‌తో ప్రకటించింది. వ్యక్తిగత సమాచార గోప్యతపై నెలకొన్న సందేహాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. ఫేస్‌బుక్‌తో డేటా షేరింగ్‌పై వినియోగదారుల్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున వినియోగదారులు టెలిగ్రామ్‌, సిగ్నల్‌ యాప్‌ వైపు మొగ్గు చూపుతుండడంతో.. వినియోగదారులు పాలసీపై సమీక్షించుకునేందుకు మరింత సమయం ఉపయోగపడుతుందని పేర్కొంది. తమ పాలసీపై వస్తున్న తప్పుడు వార్తలతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొందని, ఈ మేరకు ప్రైవసీ పాలసీని వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. మొదట నిర్ణయించిన మేరకు ఫిబ్రవరి 8న కాకుండా.. పాలసీని మే 15 నుంచి అమలులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 8న ఎవరి ఖాతాలు నిలిపివేయడం, తొలగించడం లేదని చెప్పింది. తమ యాప్‌లో గోప్యత, భద్రత, పని  విధానంపై వచ్చిన అపోహలను తొలగించేందుకు కృషి చేస్తామని చెప్పింది.


                    Advertise with us !!!