బైడెన్ ఆర్థిక ప్రణాళిక...1.9 ట్రిలియన్ల డాలర్ల ప్యాకేజీ

biden-announces-usd-19-trillion-covid-19-stimulus-plan-to-revive-us-economy

కరోనా వల్ల తీవ్రంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దిశగా భారీ ఆర్థిక ప్రణాళికను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ ప్రతిపాదించారు. కొవిడ్‌ నియంత్రణ, ఆర్థికవ్యవస్థ స్థిరత్వం కోసం 1.9 ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజిని ప్రకటించారు. వచ్చే వారం బాధ్యతలు స్వీకరించిన వెంటనే అమెరికా ఆర్థిక వ్యవస్థలోకి ఈ భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రవేశపెడతామని బైడెన్‌ ప్రతిపాదించారు. దీని ద్వారా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు 160 బిలియన్‌ డాలర్లు, మరో 170 బిలియన్‌ డాలర్లు పాఠశాలలకు కేటాయించనున్నట్లు వెల్లడించారు.

అలాగే ఇంతకుముందు చెప్పినట్టే తన తొలి వంద రోజుల పాలనలో 100 మిలియన్ల మందికి టీకా అందించాలనే ఉద్దేశంతో అమెరికా రెస్క్యూ పేరిట మరో ప్రణాళికను కూడా బైడెన్‌ ప్రకటించడం జరిగింది. కరోనా దెబ్బతో అస్తవ్యస్తమైన అమెరికాకు ఈ రెండు ప్రతిపాదనలు బిగ్‌ రీలిఫ్‌ అనే చెప్పాలి. 

 


                    Advertise with us !!!