అమెరికా కోటలో భారతీయుల పాగా

17-and-counting-meet-the-indian-americans-who-are-expected-to-be-part-of-biden-harris-cabinet

అధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్‌ క్యాబినెట్‌లో మొట్టమొదటిసారిగా 12 మంది భారతీయులు స్థానం సంపాదించుకోబోతున్నారు.

1. నీరా టాండన్‌

డైరెక్టర్‌ ఆఫ్‌ ది వైట్‌హౌస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ హోదాలో వివిధ ఫెడరల్‌ సంస్థల బడ్జెట్‌లను పర్యవేక్షిస్తారు.

2. డాక్టర్‌ వివేక్‌ మూర్తి

అమెరికా సర్జన్‌ జనరల్‌గా నియమితులయ్యారు.

3. వనితా గుప్తా

అసోసియేట్‌ అటార్నీ జనరల్‌. న్యూయార్క్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ లా పూర్వ విద్యార్థి

4. ఆయెషా షా

వైట్‌హౌస్‌ డిజిటల్‌ స్ట్రాటజీ ఆఫీస్‌

5. గౌతమ్‌ రాఘవన్‌

అధ్యక్షుడి వ్యక్తిగత సిబ్బంది వ్యవహారాల కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌. భారతదేశంలో జన్మించి, సియాటిల్‌లో పెరిగారు.

6. భరత్‌ రామమూర్తి

నేషనల్‌ ఎకనమిక్‌ కౌన్సిల్‌లో డిప్యూటీ డైరెక్టర్‌. బోస్టన్‌ నివాసి. హార్వర్డ్‌ కాలేజీలోనూ, యేల్‌ స్కూల్‌ఆఫ్‌ లా లోనూ ఒకప్పుడు ప్రముఖ విద్యార్థి.

7. వినయ్‌ రెడ్డి

ప్రసంగ రచయితల విభాగం డైరెక్టర్‌. ఒహాయోలోని డేటన్‌లో పెరిగారు.

8. తరుణ్‌ ఛాబ్రా

టెనెసీ నివాసి. టెక్నాలజీ అండ్‌ నేషనల్‌ సెక్యూరిటీ విభాగం సీనియర్‌ డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రసిద్ధ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, హార్వర్డ్‌ యూనివర్సిటీ, స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీల పూర్వ విద్యార్థి.

9. సుమొనా గుహా

మేరీలాండ్‌కు చెందిన వ్యక్తి. నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌లో దక్షిణాసియా విభాగం సీనియర్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు.

10. సబ్రీనా సింగ్‌

డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.

11. వేదాంత్‌ పటేల్‌

అసిస్టెంట్‌ ప్రెస్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. గుజరాత్‌కు చెందిన వేదాంత్‌ కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు.

12. శాంతి కళత్తిల్‌

ప్రజాస్వామ్యం, మానవ హక్కులకు సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. భారతదేశంలో పుట్టి కాలిఫోర్నియాలో స్థిరపడిన కళత్తిల్‌ యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ బర్కిలీ, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ల నుంచి గ్రాడ్యుయేషన్‌ చేశారు.