
కరోనా వైరస్ వలన తల్లితండ్రులు ఉపాధి కోల్పోయి విద్యార్థులు ఆర్ధిక ఇబ్బందులు పడుతుండటంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కార్యదర్శి పొట్లూరి రవి తన సొంత నిధులతో, మిత్రుల ద్వారా గత మూడు నెలలలో దాదాపు వంద మంది విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జనవరి పన్నెండు నాడు గుంటూరుకు చెందిన ముగ్గురు విద్యార్థులు నాగశ్రీ, నిఖిల్, లోకాదిత్యలకు 35,000 రూపాయల ఉపకారవేతనాలు టీడీపీ సీనియర్ నాయకులు గుంటూరు 2 పర్యవేక్షకుడు కోవెలమూడి నాని ద్వారా అందించారు.
ఈ సందర్భంగా కోవెలమూడి నాని మాట్లాడుతూ తానా తరపున చేపడుతోన్న వివిధ కార్యక్రమాలు ఆదర్శప్రాయంగా ఉన్నాయని విద్యార్థులకు సహాయం అందిస్తున్న రవి పొట్లూరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో బాలాజీ నూకవరపు, విద్యార్థుల తండ్రులు పాల్గొన్నారు.