తల్లిగా నటిస్తే అవకాశాలు రావు అనడంలో నిజమ్ లేదు : శృతి హాసన్

Shruti Haasan on Mother Character in Movies

"తల్లిగా నటిస్తే తప్పేంటి ? అవకాశాలు రావు అనడంలో ఏ మాత్రం  నిజమ్ లేదు! అంతటితో ఆ నటి కెరీర్ పూర్తి అయిపొయింది అనడం లో నిజం లేదు గతం లో మహా నటి సావిత్రి గారు, ఎన్నో చిత్రాలలో అమ్మగా నటించారు అమ్మాయిగా కూడా నటించి మెప్పించారు."  అన్నారు సౌతిండియా గ్లామర్ స్టార్ శృతి హాసన్. టాలీవుడ్ లో 'అనగనగా ఓ ధీరుడు' సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన శృతిహాసన్‌.. ఆ తర్వాత ఓ మై ఫ్రెండ్, గబ్బర్ సింగ్, బలుపు, రామయ్యా వస్తావయ్యా, ఎవడు, రేసుగుర్రం, కాటమరాయుడు వంటి చిత్రాలతో చాలా తక్కువ సమయంలోనే ఇండ్రస్టీ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ని తన సొంతం చేసుకుంది. ఆ తర్వాత హిందీలో కూడా అగ్ర హీరోల సరసన కొన్ని సినిమాల్లో నటించిన ఈ అమ్మడికి బాలీవుడ్ ఇండస్ట్రీ అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. మళ్ళీ టాలీవుడ్ కి  వచ్చి ఇక్కడే హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే గత కొంతకాలంగా తెలుగులో సరైన హిట్ లేక మళ్ళీ తమిళ ఇండ్రస్టీ కి వెళ్లిపోయిన శ్రుతిహాసన్ ఇప్పుడు తాజగా తెలుగులో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. 

టాలీవుడ్ లో ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టిన ఈ అమ్మడు...ప్రస్తుతం తెలుగులో  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న `క్రాక్` చిత్రంలో మాస్ మహారాజా రవితేజ సరసన హీరోయిన్‌గా నటించింది .చాలా గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెరపై హీరోయిన్ గా మెరిసింది శ్రుతీహాసన్. రవితేజ సరసన శ్రుతి నటించిన `క్రాక్` సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఓ బాబుకు తల్లిగా కూడా శ్రుతి కనిపించింది. దీని గురించి తాజాగా శ్రుతి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.`పాత్రల ఎంపిక విషయంలో ఇప్పుడు చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నా. నా స్నేహితుల్లో చాలా మంది పాతికేళ్లకు ముందే అమ్మలుగా మారారు.

నిజ జీవితంలో తల్లి అయినంత మాత్రాన, వెండితెరపై తల్లి పాత్రలో కనిపించినంత మాత్రాన కెరీర్‌కు వచ్చిన ముప్పేమీ లేదు. ఐశ్వర్యా రాయ్, కరీనా కపూర్ మాతృత్వాన్ని అనుభవిస్తూనే కెరీర్లోనూ దీటుగా రాణిస్తున్నారు.వాళ్లే మాకు స్ఫూర్తి` అని శ్రుతి పేర్కొంది..ఇక ప్రస్తుతం థియేటర్లో సందడి చేస్తున్న క్రాక్ సినిమాకి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతో మళ్ళీ రవితేజ, శ్రుతిహాసన్ లకు చాలా కాలం తర్వాత సాలిడ్ హిట్ దొరికిందనే చెప్పాలి.. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో కూడా శ్రుతిహాసనే హీరోయిన్. ఈ సినిమా కూడా హిట్ అయితే మళ్ళీ శ్రుతిహాసన్ ఫామ్ లోకి వచ్చినట్లే కదా?